కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాల ని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆందోళన చేపట్టింది. మంగళవారం నగరంలోని ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు కూటమి పార్టీలు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మలను కూటమి శ్రేణులు దహనం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును బీజేపీ చోరీ చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, హుజూరాబాద్ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ బాబు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని,సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వుట్కూరి నరేందర్ రెడ్డి, అంబటి జోజి రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) జిల్లా కార్యదర్శి జిన్నం ప్రసాద్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, వరాల నర్సింగం, గడ్డం విలాస్‌రెడ్డి, పైడిపల్లి రాజు పాల్గొన్నారు.


