కరీంనగర్‌సిటీ: విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ సూచించారు. కళాశాలలోని కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రెండు, మూడో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ‘బిజ్ నోవా’ పేరుతో మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ సంబరాలు అలరించాయి. ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధి నైపుణ్యం పెంచుకోవాలన్నారు. కామర్స్ విభాగాధిపతి టి.రాజయ్య మాట్లాడుతూ కామర్స్ విద్యార్థులకు అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు, ర్యాంప్‌వాక్ అలరించాయి.


