నంబర్‌ వన్‌గా మారుస్తాం | - | Sakshi
Sakshi News home page

నంబర్‌ వన్‌గా మారుస్తాం

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

నంబర్‌ వన్‌గా మారుస్తాం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సహకారంతో రాష్ట్రంలోనే కరీంనగర్‌ను నంబర్‌వన్‌ నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. శనివారం నగరపాలకసంస్థ 3,11,29 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 11వ డివిజన్‌ కట్టరాంపూర్‌లో స్థానిక కార్పొరేటర్‌ ఆకుల నర్మదతో కలిసి సుడా నిధులు రూ.3 లక్షలతో చేపట్ట నున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, పార్క్‌లో ఓపెన్‌ జిమ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3వ డివిజన్‌ తీగలగుట్టపల్లి మాణిక్యేశ్వరినగర్‌లో కార్పొరేటర్‌ సాదినేని లావణ్యతో కలిసి నగరపాలకసంస్థ సాధారణ నిధులు రూ.24.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. 29వ డివిజన్‌ పరిధిలోని కిసాన్‌నగర్‌లో డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్‌ సోమిడి వేణుప్రసాద్‌తో కలిసి యూఐడీఎఫ్‌ నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 28, 29 డివిజన్లకు సంబంధించిన ప్రజలకు తాగునీటి సరఫరా కోసం హనుమాన్‌ ఆలయం వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.56 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పైప్‌ లైన్‌ నిర్మాణా పనులకు భూమిపూజ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement