17మంది అభ్యర్థులు.. 16,876 మంది ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

17మంది అభ్యర్థులు.. 16,876 మంది ఓటర్లు

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

17మంది అభ్యర్థులు.. 16,876 మంది ఓటర్లు రెడ్‌క్రాస్‌ ఎన్నికల తీరిలా

నేడే ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఎన్నికలు

20 పోలింగ్‌ బూత్‌లు.. ఒక్కో బూత్‌కు 900మంది ఓటర్లు

సాయంత్రానికి ఫలితాలు.. మరునాడు పదాధికారుల ఎన్నిక

బరిలో మిగిలింది: 17మంది

ఎన్నికల పోలింగ్‌: అక్టోబర్‌ 4, 2026

మొత్తం ఓటర్లు: 16,876

పోలింగ్‌ కేంద్రాలు: 20

పోలింగ్‌ సిబ్బంది: 122

ఒక్కో బూత్‌లో ఓటర్లు: 900

పోలింగ్‌ బాక్స్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి సీహెచ్‌ రామానుజాచార్యులు

పోలింగ్‌ జరిగే ప్రాంతం:

ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల

పోలింగ్‌ సమయం: ఉదయం 8 గంటల

నుంచి మధ్యాహ్నం 3 వరకు

ఓట్ల లెక్కింపు: సాయంత్రం 4 గంటల

నుంచి ఫలితం తేలేవరకు

కరీంనగర్‌ అర్బన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మూడేళ్ల పదవీకాలానికి ఎన్నికలు కావడంతో నోటు, మద్యం లేకుండా స్వచ్ఛంధంగా ఓటు వేసేలా అభ్యర్థులు ప్రచారం చేశారు. ఆదివారం స్థానిక ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారి రామానుజాచార్యులు, సహాయ ఎన్నికల అధికారి జలాలుద్దీన్‌ అక్బర్‌ ఏర్పాట్లు సమీక్షించారు. 16876 మంది ఓటర్లకు గానూ 20 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయగా 122 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వీరందరికి శనివారం శిక్షణ ఇవ్వగా పోలింగ్‌ బూత్‌లో విధులను వివరించారు. పోలింగ్‌ సిబ్బందిగా ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అసిస్టెంట్‌ రిజిష్ట్రార్లు, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్లు, ప్యాక్స్‌ సీఈవోలను నియమించగా పెద్దపల్లి జిల్లా సహకార శాఖ నుంచి పలువురిని సిబ్బందిగా నియమించారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 4గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. 5న పదాదికారులను ఎన్నుకోనున్నారు.

ఒక్కరి నుంచి 15మంది వరకు ఓటు వేయొచ్చు

అభ్యర్థులుగా కుందారపు మహేశ్వర్‌, పెండ్యాల కేశవరెడ్డి, కనపర్తి మనోహర్‌రావు, బుర్ర మధుసూదన్‌రెడ్డి, సంగెం లక్ష్మణ్‌రావు, కోల అన్నారెడ్డి, పి.విద్యాసాగర్‌, సాయినేని నరేందర్‌, సీహెచ్‌.సురేష్‌, పి.శ్రీహరిరెడ్డి, ఎ.మునీందర్‌, గోనె శ్రీనివాస్‌, వూట్కూరి రాధాకృష్ణారెడ్డి, హన్మాండ్ల రాజిరెడ్డి, డా.ముప్పిడి మదన్‌బాబు, మొగులోజు రాకేశ్‌, రాగి శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. 17మంది అభ్యర్థులకు గానూ ఓటర్లు 15మందికి మించి ఓటు వేయొద్దు. ఒక్కరికై నా ఓటు వేయొచ్చు.. ఒక్కరి నుంచి 15మంది అభ్యర్థులకు వారి పేరు పక్కన స్వస్తిక్‌ గుర్తు వేయాలి. 15మందికి మించి ఓటు వేస్తే ఎన్నికల అధికారులు చెల్లని ఓటుగా పరిగణిస్తారు.

వందశాతం పోలింగ్‌ అనుమానమే

పోలింగ్‌ ప్రక్రియ 30శాతం దాటదని తెలుస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి రావడం అనుమానమే. 4వేలకు మించి ఓటర్లు ఓటు వేసే అవకాశముందని, అభ్యర్థులు ప్రభావితం చేస్తే మరో వేయి నుంచి 2వేల ఓటర్లు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement