మట్టిలో మాణిక్యాలు.. | - | Sakshi
Sakshi News home page

మట్టిలో మాణిక్యాలు..

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

మట్టిలో మాణిక్యాలు.. ● క్రీడల్లో రాణిస్తున్న గ్రామీణ యువత ● చికిత స్వర్ణాల గెలుపుతో స్ఫూర్తి ● జాతీయ, అంతర్జాతీయమే లక్ష్యం.. ● శిక్షణ, ప్రోత్సాహం అందితే సత్తాచాటే అవకాశం మైదానంలో చిరుతలు ఆటల్లో అదుర్స్‌ మనోజ్ఞ ●

తెలంగాణ పల్లెల్లోని మట్టికి మహత్యం ఉంది. ఒకప్పుడు ఉనికి కోసం పోరాడిన యువత.. నేడు క్రీడాకీర్తిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడిస్తున్నారు. మారుమూల పల్లెల్లో పుట్టి.. వసతులు లేమితో సతమతమైనా.. కొండంత మనోనిబ్బరం.. సాధించాలనే కసితో అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రీడాచరిత్రలో తమ పేరును పదిలం చేసుకుంటున్నారు. పల్లెటూరి పిల్లబాటలో పడ్డ అడుగులు జాతీయ, అంతర్జాతీయకి పరుగు పెడుతున్నాయి. అథ్లెటిక్స్‌.. ఫుట్‌బాల్‌.. కబడ్డీ.. ఆట ఏదైనా పతకం మాదే అంటూ పట్టుబిగిస్తున్నారు.

– సాక్షి, పెద్దపల్లి/వేములవాడ

పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన తుమ్మల మనోజ్ఞ అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌.. రెండు క్రీడల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ధర్మారంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. అథ్లెటిక్స్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్‌ జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు 15 సార్లు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని.. మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement