కరీంనగర్‌క్రైం: పాఠశాల విద్యార్థుల రవాణా, వాహనాల భద్రతపై పోలీసు, రోడ్డు రవాణాశాఖ అధికా రులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఫిట్‌నెస్ లేని 17స్కూల్ బస్సులు, 50 ఆటోలను సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్, పర్మిట్, ఇన్సూరెన్స్ లేని 64 వాహనాలపై, యూనిఫాం ధరించని 13 మంది డ్రైవర్లపై, నంబర్ ప్లేట్ లేని వాహనం, ఓవర్‌లోడింగ్‌తో నడుపుతున్న 9 వాహనాలపై మొత్తం 87 వాహనాలపై ఉల్లంఘనల కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ‘ప్రతి చిన్నారి భద్రత మనందరి బాధ్యత అని’ పాఠశాల వాహనాల డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదన్నారు. ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, మోటార్ వెహికల్ ఇన్స్‌పక్టర్ జి.కవిత, ట్రాఫిక్ సీఐ అంజయ్య పాల్గొన్నారు.
పలువురు తహసీల్దార్ల బదిలీ
కరీంనగర్ అర్బన్: రెవెన్యూశాఖలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ చిత్రామిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కలెక్టరేట్ ఏవోగా బదిలీ అయిన ఈ.నరేందర్‌ను గన్నేరువరం తహసీల్దార్‌గా బదిలీ చేయగా కోడం కనకయ్య(గన్నేరువరం)ను చిగురుమామిడి తహసీల్దార్‌గా బది లీ చేశారు. ఇక ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన శంకరపట్నం తహసీల్దార్ సురేఖ స్థానంలో సైదా పూర్ తహసీల్దార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నాయబ్ తహసీల్దార్ పి.మనోజ్‌కుమార్(చొప్పదండి)ను కరీంనగర్ అర్బన్, కె.సుమలత(కొత్తపల్లి)ను మానకొండూరు, బి.రమేష్‌బాబు(హుజూరాబాద్)ను గంగాధర, పి.కళావతి(గంగాధర)ని చిగురుమామి డి, కె.లక్ష్మణ్(ఎస్డీసీ)ను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.
దేవాదాయశాఖ ఈవోలకు పదోన్నతులు
కరీంనగర్‌కల్చరల్: దేవా దాయ ధర్మాదా యశాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు అధికా రులకు గ్రేడ్–1 కార్యనిర్వాహణాధికారులుగా పదో న్నతులు లభించా యి. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని సాయినగర్‌లోని శ్రీ విజయ గణపతి సాయిబాబా ఆలయంలో గ్రేడ్–2 ఈవోగా ఉన్న ఎండపల్లి మారుతికి గ్రేడ్–1 ఈవోగా పదో న్నతి కల్పించి సిద్దిపేట జిల్లా మోహినిపూర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి బదిలీ చేశారు. తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ గ్రేడ్–2 ఈవోగా పనిచేస్తున్న నాగుల అనిల్ కుమార్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని అగ్రహారం శ్రీ హనుమాన్ ఆలయానికి గ్రేడ్–1 ఈవోగా బదిలీ చేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న డి.కిరణ్‌కు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్ల గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గ్రేడ్–1 ఈవోగా పదోన్నతిపై పంపించారు.


