నెలరోజుల్లో మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవనం | - | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవనం

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

● ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హామీ

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ భవన నిర్మాణాన్ని నెలరోజుల్లో పూర్తి చేయించి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల విద్యార్థులు సంజయ్‌ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కళాశాలలో జనరేటర్‌ లేకపోవడంతో వెంటనే అందిస్తానన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్‌ విద్యార్థినులకు టాయిలెట్‌కు వెళ్లడం ఇబ్బందిగా మారిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా సీఎస్సార్‌ నిధులతో టాయిలెట్‌ను ఏర్పాటు చేయిస్తానన్నారు. ఆధునిక ఆడిటోరియం, స్పోర్ట్స్‌ స్టేడియం లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని తెలపగా భవన నిర్మాణ కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. నెల రోజుల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావా లని కోరడంతో అందుకు అనుగణంగా పనులను వేగవంతం చేస్తానని సదరు కాంట్రాక్టర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement