బడిబాట నిర్వహించి.. అక్షరాభ్యాసం చేయించి.. | - | Sakshi
Sakshi News home page

బడిబాట నిర్వహించి.. అక్షరాభ్యాసం చేయించి..

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

హుజూరాబాద్‌: పిల్లలు భవిష్యత్‌లో ఉన్నతస్థానా ల్లో నిలబడాలని డీఈవో నరెడ్ల ప్రశాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం హుజూరాబాద్‌లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బడిబాట నిర్వహించారు. డీఈవో పాల్గొని చిన్నారులతో అక్షరాభ్యాసం చే యించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు కొత్త రంగులో స్కూల్‌ యూనిఫాం, టై, బెల్ట్‌, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు బ్రెక్‌ఫాస్ట్‌ అందిస్తోందన్నారు. తాను హుజూరాబాద్‌ వాస్తవ్యుడనని, స్థానిక శిశు మందిర్‌లో విద్యాభ్యాసం చేశానని గుర్తు చేశారు. మండలంలోని పాఠశాలల్లో ఏవైనా అవసరాలు, ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని ఎంఈవోను ఆదేశించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రొంటాల సుహాసిని, ఎంఈవో విడపు శ్రీనివాస్‌, కౌ న్సిలర్లు కోయల్‌కార్‌ భారతి, సొల్లు సునీత, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు డీఎం.శోభారాణి, ప్ర ధానోపాధ్యాయురాలు గోగుల రాధిక పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement