కరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధునీకరణ, పారిశుధ్య నిర్వహణ, రైతులకు సదుపాయాల కల్పనపై వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న ప్రత్యేక దృష్టిసారించారు. మార్కెట్ యార్డులో చెత్తాచెదారం పేరుకుపోయిన నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా యా ర్డును పరిశీలించి, పారిశుధ్య పనులు పర్యవేక్షించా రు. ధాన్యం విక్రయాల కోసం మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, పారిశుద్ధ్యం, భద్రత తదితర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో ధాన్యం విక్రయా ల కోసం వచ్చే రైతులు ఇబ్బందులు పడకుండా యార్డులో పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించారు.


