గోదావరిఖని: సింగరేణిలో కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శ్రీరాంపూర్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న 335 మంది కార్మిక వారసులకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఇటీవల జరిగిన సభలో కారుణ్య నియామకపత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం.. మెడికల్ ఇన్వాలిడేషన్ పూర్తయి, శిక్షణ పూర్తిచేసుకున్న మరో 200 మందికిపైనే ఉన్నారు. 16 నెలల క్రితం మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పటినుంచి వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ప్రభుత్వం చేపట్టిన కారుణ్య నియామకాలపై ఏసీబీ విచారణ చేపడతున్నామని శాసన మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడంతో ఇక ఇప్పట్లో కారుణ్య నియమకాలు ఉండవనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఉన్నఉద్యోగాలు ఊడపీకే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థలో ఇప్పటివరకు సుమారు 17వేల మంది కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందారు.
18 ఏళ్ల క్రితం కారుణ్యం
సింగరేణిలో 18ఏళ్ల క్రితం కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం 2018 మార్చి 09న మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల కాగా ఏప్రిల్‌లో మెడికల్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్లపాటు రెగ్యులర్‌గా మెడికల్ బోర్డు కొనసాగింది. గతేడాది మార్చిలో ఈప్రక్రియ నిలిచిపోయింది.
చిక్కులన్నీ అధిగమిస్తామని మంత్రులు
అయినా, బాధితుల్లో తొలగని అనుమానాలు


