ప్రైవేటుకు టాటా.. సర్కార్‌ బాట | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు టాటా.. సర్కార్‌ బాట

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని చిక్కుడువానిపల్లి గ్రామంలో కొన్నేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. దీంతో గ్రామంలోని విద్యార్థులు తంగళ్ళపల్లిలోని ప్రైవేటు స్కూలుకు బస్సులో వెళ్తుండేవారు. ఈనేపథ్యంలో సర్పంచ్‌ చింతమడక కళ్యాణ్‌, ఉపసర్పంచ్‌ చిక్కుడు సత్యం, గ్రామస్తులు కలిసి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను గ్రామంలోకి రానివ్వలేదు. మంగళవారం తమ గ్రామంలోని 12 మంది విద్యార్థులను తమ ఊరు పక్కనే ఉన్న రామాజీపేట ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు. తమ గ్రామంలోని పాఠశాలను తెరిపించాలని జిల్లా విద్యాధికారిని సర్పంచ్‌ కోరగా, కొంత సమయం తర్వాత ప్రారంభిస్తామని తెలిపినట్లు సర్పంచ్‌ వివరించా రు. తమ గ్రామం నుంచి విద్యార్థులను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాజీపేటకు తీసుకెళ్లేందుకు వ్యాన్‌ పంపిస్తామని, ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హెచ్‌ఎం తెలిపారని సర్పంచ్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement