1. పొద్దస్తమానం పనిచేస్తూనే ఉండే బానిస నోరు అనే భూస్వామి వద్ద వెట్టి చేస్తోంది
ఆయన ఇంట్లోకి ఎన్నెన్ని తెచ్చి పడేసినా నోరు మెదపక దంచి, మెత్తగా నూరుతుంది.
2. మనిషి జాతకమే నాదగ్గరుందని
పోసుకోలు కబుర్లు చెప్తుంది
ప్రమాణ సాక్షిగా నిజమే చెప్తున్నానంటూ
మాటిమాటికీ ఓట్లు వేస్తుంది.
3. పిడికెడంత చిన్న ఇల్లు
దాన్లో నాలుగు గదులు
క్షణం తీరిక లేదు
దమ్మిడి ఆదాయం లేదు.
4. పటిష్టమైన భద్రత మధ్య
ప్రధానమైన అవయవం
అందరితో పని చేయిస్తూ
అన్నీ చూసుకునే పెద్దబాస్
ముడతల శరీరమే గానీ
మహా తెలివిమంతురాలు
5. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ
తాను నోరిప్పి ఒక్కమాటా మాట్లాడదుఅంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా
లోలాకులు, రింగులు, జూకాలు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది.
6. ప్రాణవాయువును పీల్చుకుంటుంది
కార్బన్ డైయాకై ్సడ్ను వదుల్తుంది
వాసనలను చక్కగా చెపుతుంది
దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది.
7. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు కలిపి ముద్దలు పెడితేనే తింటుంది.
ఇంత గారాబమైతే ఎలాగమ్మా!
8. శరీరం రాజులా మీద ఎక్కి కూర్చుంటే సేవకుల్లా ఇవి మోసుకుంటూ తిరుగుతాయి.
ముల్లు గుచ్చుకున్నా, ఎదుర్రాయి కొట్టుకున్నా బాధలు, నొప్పులు, కన్నీళ్లు, రక్తాలు వీటికే
– కందేపి రాణీప్రసాద్
రచయిత్రి, సిరిసిల్ల
జిల్లా: రాజన్నసిరిసిల్ల
జవాబులు: 1.జీర్ణాశయం,
2.అరచేయి, 3.గుండె,
4.మెదడు, 5.చెవి, 6.ముక్కు, 7.నోరు, 8.కాళ్ళు


