బన్నీ వేసవి యాత్ర –24 | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర –24

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

బన్నీ వేసవి యాత్ర –24 ‘టీవీ వద్దు.. ఫోన్‌ వద్దు.. కథల పుస్తకాలు చదువుదాం’

‘టీవీ వద్దు.. ఫోన్‌ వద్దు.. కథల పుస్తకాలు చదువుదాం’

ఆదివారం పొద్దున్నే బన్నీ టీవీ ఆన్‌ చేశాడు.రామ్‌ ఫోన్‌లో గేమ్‌ పెట్టాడు.

చుక్క, స్వప్న కూడా వాళ్ళ పక్కన కూర్చుని స్క్రీన్‌కే చూస్తున్నారు.

తాతయ్య వచ్చి కరెంట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ‘ఇవాళ కరెంట్‌ కట్‌’ అని నవ్వాడు.

‘బోర్‌ కొడుతుంది తాతయ్య’ అని చుక్క ముఖం చిట్లించింది.

తాతయ్య అలమారలో నుంచి ఒక పాత సంచి తీశాడు. నిండా కథల పుస్తకాలు.

‘తెనాలి రామ, పంచతంత్రం, చందమామ – ఇవి చదివితే బుర్రకు బూస్ట్ఙ్‌ అన్నాడు.

స్వప్న ఒక పుస్తకం తీసి చదివింది. ‘అరె, ఇది బాగుంది’ అని నవ్వింది.

రామ్‌, బన్నీ కూడా ఒక్కో పుస్తకం తీసుకున్నారు. గది అంతా నిశ్శబ్దం అయింది.

తాతయ్య చెప్పాడు: ‘టీవీ, ఫోన్‌ కళ్ళకు నొప్పి. పుస్తకం మెదడుకు పదును.’

చుక్క లేచి అంది: ‘ తాతయ్యా ... రోజూ అరగంట కథలు చదువుతాం.’

పిల్లలకి మాట:

స్క్రీన్‌ చూస్తే సమయం పోతుంది. పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది.

డాక్టర్‌ కోట లక్ష్మణ్‌

ప్రభుత్వ ఉపాధ్యాయులు

గ్రామం: కాకర్లపల్లి, మంథని

జిల్లా: పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement