తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

చొప్పదండి: తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌ చేస్తున్న దొంగలతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొంతకాలంగా పట్టణంలో వరుస చోరీలు జరుగుతుండగా... తాళం వేసిన ఇండ్లలోనే చోరీలు జరుగుతున్నాయి. తాజాగా విశ్రాంత ఉపాధ్యాయుడు రాజేశం కుటుంబ సభ్యులతో తిరుమల దర్శనానికి వెళ్ళి రాగా చోరీ ఘటన చోటు చేసుకుంది. నలుగురు సభ్యుల ముఠా చోరీకి పాల్పడినట్లు స్థానికంగా సీసీ కెమరాల్లో కనిపిస్తోంది. పోలీసుల ఉనికిని గమనిస్తు దొంగలు చోరీకి పాల్పడటం గమనార్హం. ముఖానికి గుడ్డ కట్టుకొని, నెత్తిన టోపీ పెట్టుకొని చోరీ అనంతరం దర్జాగా నడుచుకుంటు వెళ్ళినట్లు సీపీ పుటేజీల్లో కనిపిస్తోంది. పగటి పూట రెక్కీ నిర్వహిస్తూనే రాత్రి పూట చోరీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పైగా సీసీ కెమరాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకుంటు నంబర్‌ లేని వాహనంపై దొంగలు సంచరిస్తు ఫోన్‌లలో మాట్లాడటం గమనార్హం. కాగా చోరీ ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని, పలు క్లూల ఆధారంగా దొంగలను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నామని ఎస్‌ఐ నరేశ్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement