బల్దియా ప్రజావాణికి 24 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

బల్దియా ప్రజావాణికి 24 దరఖాస్తులు

Mar 17 2026 7:46 AM | Updated on Mar 17 2026 7:46 AM

బల్దియా ప్రజావాణికి 24 దరఖాస్తులు 18న ఇంటర్‌ రెండో విడత మూల్యాంకనం విద్యానగర్‌(కరీంనగర్‌): ఇంటర్‌ పరీక్షల రెండో విడత మూల్యాంకనం ఈనెల 18న కరీంనగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరుగుతుందని డీఐఈవో వి.గంగాధర్‌ తెలిపా రు. ఎక్జామినర్‌, వాల్యూయేషన్‌ నియామక ఉత్తర్వులు అందుకున్నవారు సకాలంలో మూల్యాంకనానికి హాజరుకావాలన్నారు. ● వీబీ జీరామ్‌జీలో సీసీ రోడ్ల నిర్మాణం ● జిల్లాకు రూ.7.50 కోట్లు మంజూరు

కరీంనగర్‌కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 24 దరఖాస్తులు వచ్చాయి. పట్టణ ప్రణాళిక విభాగానికి 12, ఇంజినీరింగ్‌కు మూడు, ఇంది రమ్మవి ఒకటి, శానిటేషన్‌కు రెండు, రెవెన్యూ కు సంబంధించి ఆరు వచ్చాయి. దరఖాస్తుల ను పరిష్కరిస్తామని మేయర్‌ కొలగాని శ్రీనివా స్‌, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు.

ఊర చెరువును కాపాడాలి

17వ డివిజన్‌ కొత్తపల్లి ఊర చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని కొత్తపల్లి కాంగ్రెస్‌ కమిటీ ఫిర్యాదు చేసింది. 17,18 డివిజన్లలో కరీంనగర్‌ నగరపాలకసంస్థలో అమలు చేస్తున్న పన్నులే వర్తింపజేయాలన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తపల్లిలో నిర్వహించిన అధికారిక వైద్య శిబిర వేదికపై కార్పొరేటర్‌ వేముల కవిత భర్త చంద్రశేఖర్‌ కూర్చున్నారని జి.శ్రీనివాస్‌, గు న్నాల రమేశ్‌, పి.శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. 44వ డివిజన్‌ షాలిమార్‌ ఫంక్షన్‌హాల్‌ నుంచి టెలిఫోన్‌క్వార్టర్స్‌ వెళ్లే రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్‌ చాడగొండ కవిత కోరారు. 62వ డివిజన్‌ మంకమ్మతోట ఆంజనేయస్వామి ఆలయం ఎదుట స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్‌ పెద్దపల్లి శ్రీలేఖ కోరారు. 5వ డివిజన్‌ రజ్విచమాన్‌ ప్రాంతంలోని క్రికెట్‌ కోర్టులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

మత్స్యకారులకు పీఎం ఎంకేఎస్‌ఎస్‌వై పథకం

కొత్తపల్లి(కరీంనగర్‌): మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రధానమంత్రి మత్స్య కిసాన్‌ సమృద్ధి సహ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎస్‌ఈ వీఎల్‌ఈ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వేముల అనిల్‌ కుమార్‌ తెలిపారు. కరీంనగర్‌ 16వ డివిజన్‌ మల్కాపూర్‌లోని సీఎస్‌ఈ కేంద్రంలో మత్స్యకారులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు.

మట్టి రోడ్లకు మహర్దశ

కరీంనగర్‌రూరల్‌: మట్టి రోడ్లతో గ్రామీణ ప్రజ లు పడుతున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వీబీ జీరామ్‌జీ పథకంలో సీసీరోడ్లు మంజూరు చేసింది. కరీంనగర్‌ ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రతిపాదన మేరకు కలెక్టర్‌ చిత్రమిశ్రా 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 58 పనులకు జిల్లాకు రూ.7.50 కోట్లు కేటా యించారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ని గ్రామాల్లో ఉపాధి నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. మరో 15రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగు స్తుండగా నిధులు మంజూరు కావడంతో పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచా యతీల నుంచి సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాని కి అవసరమైన తీర్మాణాలను తీసుకుని పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మండలాల వారీగా నిధులు

కరీంనగర్‌ రూరల్‌ మండలానికి రూ.30 లక్షలు, కొత్తపల్లికి రూ.30 లక్షలు, మానకొండూర్‌కు రూ.15 లక్షలు, తిమ్మాపూర్‌కు రూ.60 లక్షలు, గన్నేరువరానికి రూ. 60లక్షలు, గంగాధరకు రూ.115లక్షలు, రామడుగుకు రూ.45లక్షలు, చిగురుమామిడికి రూ.15లక్షలు, హుజూరాబాద్‌కు రూ.45లక్షలు, జమ్మికుంటకు రూ.90 లక్షలు, వీణవంకకు రూ.100లక్షలు, సైదాపూర్‌కు రూ.30లక్షలు, ఇల్లంతకుంటకు రూ.85లక్షలు, శంకరపట్నం మండలానికి రూ.75లక్షలు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement