ఎన్నికల్లో లబ్ధికే.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో లబ్ధికే..

Mar 16 2026 7:52 AM | Updated on Mar 16 2026 7:52 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధికోసమే నగరంలో హడావుడిగా అభివృద్ధి పనులు చేపట్టింది. సీఎంఏ డబ్బులు విడుదల చేస్తే ఆ పనులు ప్రభుత్వం మారినా పూర్తయ్యేవి. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన పనులకు రూ.30 కోట్ల బకాయిలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ముకరాంపుర, అశోక్‌నగర్‌ లాంటి ప్రాంతాల్లో సగంలో నిలిచిన రోడ్లను పూర్తి చేశాం. మిగతావి త్వరలో పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

– వైద్యుల అంజన్‌కుమార్‌,

కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత

నగరంలో సీఎం హమీ పథ కం కింద చేపట్టి, సగంలో నిలిచిపోయిన పనుల ను పూర్తి చేయాల్సిన బాఽ ద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రూ.132 కోట్లతో చేపట్టిన పనుల్లో రూ.55 కోట్ల పనులు పూర్తయినట్లు నగరపాలకసంస్థ అధికారులు బిల్లులు రికార్డు చేసి ప్రభుత్వానికి పంపించారు. అసంపూర్తి పనులు పూర్తిచేసేందుకు సరిపడా నిధులు నగరపాలకసంస్థ వద్ద లేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే తప్ప సీఎంఏ కింద చేపట్టిన మొత్తం 65 పనులు పూర్తి కావు. ప్రత్యేక నిధులు కేటాయించి పనులు పూర్తిచేయాలి.

– వై. సునీల్‌రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

పట్టించుకోరా?

నగరంలో సీఎం హామీ పథకం కింద చేపట్టిన పనులను రెండేళ్లు గడిచినా పూర్తి చేయకపోవడం దారుణం. మా ప్రభుత్వ హయాంలో నగరంలోని అంతర్గత రోడ్లు, లింక్‌ రోడ్లను నిర్మించేందుకు పనులు మొదలు పెట్టాం. ఈ లోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు స్విచ్‌ ఆఫ్‌ అయినట్లు నిలిచిపోయాయి. అప్పటి నుంచి 65 చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలి. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం.

– చల్ల హరిశంకర్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement