కరీంనగర్ కార్పొరేషన్: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ సాధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం నగరంలోని మల్టీపర్పస్ పార్క్‌లో పాఠశాలల విద్యార్థులకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. యోగా, డ్యాన్స్‌తో పాటు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు కమిషనర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎంఏ అధికారి షాహిద్ మసూద్, సహాయ కమిషనర్ దిలీప్‌కుమార్, ఎంహెచ్‌ఓ సుమన్, పర్యావరణ ఇంజినీర్లు స్వామి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


