గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే

Mar 16 2026 7:39 AM | Updated on Mar 16 2026 7:39 AM

గోదావరిఖని(రామగుండం): రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తిని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. స్థానిక మున్సిపల్‌ ఆఫీస్‌ తీన్‌రాస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. ఎడమకాలు పైనుంచి లారీ టైర్‌ వెళ్లడంతో మడమస్థానంలో నుజ్జునుజ్జు అయ్యింది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే, మేయర్‌ మహంకాళి స్వామి వాహనం దిగి గాయపడిన వ్యక్తిని పరామర్శించాడు. హుటా హుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ట్రాఫిక్‌ పోలీసులకు సూచించారు. ట్రాఫిక్‌ ఎస్సై హరిశేఖర్‌ పోలీసువాహనంలో ఆస్పత్రికి తరలించారు.

కార్మికుడికి పరామర్శ

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు రోడ్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు దండు అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంటులో సేఫ్టీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ తన బైక్‌పై ప్లాంటు రోడ్‌లో వెళ్తుండగా కారు ఢీకొంది. చికిత్స కోసం పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లోని ధన్వంతరీ ఆస్పత్రి, అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌, మేయర్‌ మహంకాళి స్వామి, అనిల్‌ను పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి భరోసాగా నిలుస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement