అమృత్‌ మిత్ర మహోత్సవం.. రామగుండం మహిళకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ మిత్ర మహోత్సవం.. రామగుండం మహిళకు అవకాశం

Mar 15 2026 1:25 AM | Updated on Mar 15 2026 1:25 AM

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థకు చెందిన స్వశక్తి మహిళ బూర్గుల అనిత న్యూ ఢిల్లీలోని భారత మండపంలో ఈ నెల 13న నిర్వహించిన కేంద్రం ప్రభుత్వ అటల్‌ మిషన్‌ ఫర్‌ రీజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(అమృత్‌ పథకం) అమృత్‌ మిత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. 59వ డివిజన్‌లోని మార్గదర్శి స్లమ్‌ సమాఖ్యకు చెందిన శ్రీసరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు అయిన అనిత అమృత్‌ మిత్రగా ఎంపికై , కొంతకాలంగా దుర్గానగర్‌ పార్క్‌లో పని చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అమృత్‌ మిత్రలు పాల్గొనగా, తెలంగాణలోని ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్ల నుంచి ఐదుగురు స్వశక్తి సంఘాలకు చెందిన అమృత్‌ మిత్రలను నామినేట్‌ చేయగా, అందులో రామగుండం నుంచి అనితకు అవకాశం లభించడం విశేషం. మహోత్సవంలో ఐదు కార్పొరేషన్ల నుంచి బి.అనిత (శ్రీసరస్వతి ఎస్‌హెచ్‌జీ, రామగుండం), హరిత (శ్రీ చైతన్య ఎస్‌హెచ్‌జీ, కరీంనగర్‌), చిట్టెమ్మ (మయూరిక మహిళా సంఘం, మహబూబ్‌నగర్‌), ఎల్‌.ఝాన్సీ రాణి (లయ ఎస్‌హెచ్‌జీ, ఖమ్మం), చిట్యాల శ్రీలత (మేరీమాత పొదుపు సంఘం, జీడబ్ల్యూఎంసీ) పాల్గొన్నారు.

మొదటిసారి ఫ్లైట్‌ ప్రయాణం

అమృత్‌ పథకం కింద వివిధ పనులు నిర్వహిస్తున్న ఈ ఐదుగురు మహిళలు తొలిసారిగా విమానంలో ఢిల్లీకి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు రావడం తమ జీవితంలో మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. కలలో కూడా ఊహించని విధంగా విమాన ప్రయాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకెళ్లిన ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement