న్యూస్‌రీల్
పది పరీక్షలు ప్రారంభం
జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు ఉండగా.. 13,137 రెగ్యులర్ విద్యార్థులకు గాను 13,122 మంది హాజరయ్యారు. 15 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటుగా ముగ్గురు విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరయ్యారు. 36 సెంటర్లను ఇన్‌చార్జి డీఈవో, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో పాటు ఇతర ముఖ్య అధికారులు తనిఖీ చేశారు. నగరంలోని ఓల్డ్ హైస్కూల్, ధన్గర్‌వాడీ పాఠశాలను డీఈవో అశ్వినీ తానాజీ వాకడే పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ఎస్సార్ డీజీ స్కూల్‌ను
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీ చేశారు. పలుకేంద్రాల వద్ద స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. –కరీంనగర్ టౌన్


