● మున్సిపల్ పరిధిలో రూ.3,24,44,000 లక్ష్యం పూర్తి
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ 2025–26 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే మొదటిస్థానం సాధించింది. పట్టణంలో 12,668 నివాసాలు ఉన్నాయి. వందశాతం పన్ను వసూళ్ల లక్ష్యంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఎండీ అయాజ్ ఆధ్వర్యంలో మార్చి 13 నాటికి రూ.3,24,44,000 వసూళ్లు సాధించింది. లక్ష్య ఛేదనలో రాష్ట్రంలోనే జమ్మికుంట ప్రథమస్థానంలో నిలిచింది. మరో పక్షం రోజుల సమయం ఉండగా మరిన్ని పన్నులు వసూలయ్యే అవకాశముంది. 2024–25 లోనూ వందశాతం పన్ను వసూల్ చేసి టాప్‌లో నిలిచారు. పట్టణాభివృద్ధికి రూ.3కోట్ల నిధులు మంజూరు చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చైర్మన్ ములుగు ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పన్నువసూళ్లలో జమ్మికుంట మొదటిస్థానం సాధించడం గర్వకారణం అన్నారు. కమిషనర్ ఎండీ అయాజ్, అధికారులను శాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మేనేజర్ రాజిరెడ్డి, ఆర్‌ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ వాణి, సుపర్ వైజర్ రాజశేఖర్‌రెడ్డి, ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ మహేశ్ పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.భగత్‌నగర్ ఫీడర్ పరిధిలోని వేంకటేశ్వరకాలనీ, విఘ్నేశ్వరకాలనీ, భగత్‌నగర్, రామచంద్రాపూర్‌కాలనీ, రెడ్‌హిల్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. కొత్తపల్లి మండలంలోని 33/11 కె.వీ.బావుపేట, ఆసిఫ్‌నగర్, బద్దిపల్లి సబ్‌స్టేషన్లలో విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం నుంచి 11.30 గంటల వరకు గ్రానైట్ పరిశ్రమలు, బద్దిపల్లి, కమాన్‌పూర్, ఎలగందుల, బావుపేట ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.


