పిల్లలు సరిపడా నీరు తాగకుంటే రక్తం చిక్కపడుతుంది. తద్వారా తలనొప్పి, అలసట, కడుపునొప్పి, మూత్రం రంగు మారడం వంటి సమస్యల బారిన పడుతారు. ఏకాగ్రత తగ్గి ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు. వేసవిలో చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు వెళ్లిపోవడంతో సమస్య మరింత జఠిలమై డీ హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం సైతం ఉంది. తగినంత నీళ్లు తీసుకోవడం, విసర్జించడం ముఖ్యమనే ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి.
–వివేక్‌రావు, పిల్లల వైద్యనిఫుణుడు, కరీంనగర్


