కరీంనగర్‌టౌన్: ఇంటర్ పరీక్షలు శుక్రవారంతో ముగి శాయి. విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఆయా కళాశాలలు, హాస్టళ్ల వద్దకు తల్లిదండ్రులు చేరుకోవడంతో సందడి నెలకొంది. ఆటోలు, బస్సుల్లో రద్దీ కనిపించింది. శుక్రవారం నాటి సెకండియర్ పరీక్షలో జిల్లావ్యాప్తంగా 371మంది గైర్హాజరైనట్లు డీఐఈవో గంగాధర్ తెలిపారు. జనరల్ విభాగంలో 1,5271 మందికి 298 మంది గైర్హాజరయ్యారు. 14,972 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1,032 మందికి 73మంది గైర్హాజరు అయ్యారు. 959మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 16,302 మందికి 371 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 15,931 మంది పరీక్ష రాశారని డీఐఈవో వివరించారు.


