కరీంనగర్ క్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలను సమర్థవంతంగా ఎదుర్కొవడమే లక్ష్యంగా కరీంనగర్ పోలీసు సిబ్బందికి ‘మాబ్ ఆపరేషన్ డ్రిల్’పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని సీటీసీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సీపీ గౌస్‌ఆలం పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి ప్రత్యక్ష అవగాహన కల్పించారు. గుంపులుగా చేరి అల్లర్లు సృష్టించే వారిని చెదరగొట్టే సమయంలో లాఠీచార్జ్ చేసే విధానం, గ్యాస్ గన్‌పేల్చే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. స్మోక్ గన్‌ఫైరింగ్,‘వజ్ర’ వాహనాన్ని క్షేత్రస్థాయిలో ఎలా వినియోగించాలో వివరించారు. ఆర్‌ఐలు రజినీకాంత్, జానీమియా, కిరణ్ కుమార్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


