కరీంనగర్ సిటీ: నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హరిత రసాయన శాస్త్రంపై రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. కార్యక్రమానికి శాతవాహన విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డి.సురేశ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై హరిత ఇంధనాలు వాటి లభ్యత, రసాయన శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని వివరించారు. టీజీ సీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాలుష్య కారకాలపై ఆందోళన ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ మహిళా కళాశాల రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు ఇలాంటి సద స్సు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా శాస్త్ర విజ్ఞానంపై మరింత దృష్టి పెరుగుతుందన్నారు. ఎల్‌ఐసీ డివిజనల్ మేనేజర్ శివ నాగప్రసాద్ తదితరులు ఉన్నారు.


