39 సిలిండర్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

39 సిలిండర్లు స్వాధీనం

Mar 13 2026 7:45 AM | Updated on Mar 13 2026 7:45 AM

● విజిలెన్స్‌, సివిల్‌ సప్లయ్‌ మెరుపుదాడులు

● విజిలెన్స్‌, సివిల్‌ సప్లయ్‌ మెరుపుదాడులు

కరీంనగర్‌ అర్బన్‌: డొమెస్టిక్‌ గ్యాస్‌ అక్రమ వినియోగంపై అధికారులు కొరఢా ఝుళిపించారు. గురువారం సివిల్‌ సప్లయ్‌, విజిలెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. నగరంలోని హోటళ్లు, చిరుతిళ్ల కేంద్రాల్లో దాడులు నిర్వహించగా 39 సిలిండర్లను స్వాఽధీనం చేసుకున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా వంట గ్యాస్‌పై నిఘాను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో నగరంలోని హోటళ్లలో విచ్చలవిడిగా వంటగ్యాస్‌ వినియోగిస్తున్నట్లు తేలింది. విజి లెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రత్యేక అధి కారులు లక్ష్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీటీ సురేందర్‌, ఎఫ్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి నగరంలోని పలు ప్రాంతాలను జల్లెడ పట్టారు. మంచిర్యాల చౌరస్తాతో పాటు కలెక్టరేట్‌ రోడ్డులోని హోటళ్లలో భారీ ఎత్తున వంట గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెలంగాణ అమరవీరులస్తూపం వద్ద వంట గ్యాస్‌ను రీఫిల్లింగ్‌ చేస్తుండగా 8 సిలిండర్లు పట్టుకున్నారు. తనిఖీలు ఇక ప్రతి రోజు ఉంటాయని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు స్పష్టం చేశారు. వంట గ్యాస్‌ దుర్వినియోగం చేస్తే ఫోన్‌ నంబర్‌ 8008301450 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement