ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో సాంకేతిక కారణాలతో అమ్మోనియా లీకై ప్లాంట్ షట్‌డౌన్ అయింది. యుద్ధ వాతావరణంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు. గడిచిన మూడు నెలల్లో సాంకేతిక సమస్యలతో మూడుసార్లు ప్లాంట్ షట్‌డౌన్ అయింది. ప్రస్తుతం కూడా సాంకేతిక కారణాలతో ప్లాంట్ షట్‌డౌన్ అయిందని ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు పేర్కొన్నారు. ప్లాంట్‌లో ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.


