మంథనిరూరల్: మంథని మండలం ఎగ్లాస్‌పూర్ సమీపంలో ఖమ్మంపల్లికి వెళ్లే దారిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గోగు తిరుపతి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. భూపాలపల్లి నుంచి మంథని వైపు స్కూటీపై తిరుపతి వస్తున్న క్రమంలో మంథని నుంచి కాటారం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతి మృతిచెందగా స్కూటీ నుజ్జునుజ్జు అయింది. మంథని పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


