వేములవాడఅర్బన్: వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించి నట్లు ఈవో రమాదేవి తెలిపారు. 35 రోజుల అనంతరం హుండీని లెక్కించగా రూ. 2,16,65,140 నగదు, మిశ్రమ బంగారం 161 గ్రాములు, మిశ్రమ వెండి 10.900 కిలోలు వచ్చినట్లు వివరించారు. లెక్కింపులో కరీంనగర్ ఏసీ ఆఫీస్ రాజమౌళి పర్యవేక్షించారు.
యువకుడిపై పోక్సో కేసు
చందుర్తి(వేములవాడ): ప్రేమపేరుతో మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన వాసాల వేణుకుమార్(36) ఏసీ మెకానిక్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఓ మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో చందుర్తి ఎస్సై జిల్లెల్ల రమేశ్ కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఆర్‌వోబీ నుంచి దూకి ఆత్మహత్య
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఆర్‌వోబీ నుంచి దూకి గుర్తుతెలియని యువకుడు(30) ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలోని మసీదు పక్కన ఆర్‌వోబీ మెట్ల ద్వారా పైకి ఎక్కిన గుర్తు తెలియని వ్యక్తి వంతెన పైనుంచి దూకాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి వద్ద ఎలాంటి అధారాలు లేవని, నల్ల చొక్కాపై తెల్ల బొమ్మలు ఉన్నాయని సీఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచా మని, వివరాల తెలియ వస్తే జమ్మికుంట పోలీ స్‌స్టేషన్ టౌన్ సీఐ రామకృష్ణ సెల్ నంబర్ 87126 70776ను సంప్రదించాలని సూచించారు.
ఉరేసుకుని యువకుడు..
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన శివరాత్రి గణేశ్(19) ఒంటరితనాన్ని భరించలేక, జీవితంపై విరక్తి చెంది ఇంటి పక్కన గల రేకులషెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


