శంకరపట్నం: కారులో ఏర్పాటు చేసుకునే జీపీఎస్ బంగారం దొంగలను పట్టించింది. బుధవారం రాత్రి జరిగిన దారి దోపిడీ ఘటనలో కేసు నమోదు చేసుకున్న జిల్లాలోని ఎల్‌ఎండీ పోలీసులు కారు జీపీఎస్‌ను ట్రాక్‌చేసి కేశవపట్నంలో గురువారం ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన నయీం, ఎబ్‌నైజర్, నాగరాజు కారులో తిరుగుతూ చోరీలకు పాల్పడుతుంటారు. గుండ్లపల్లికి చెందిన ఆర్‌ఎంపీ తమ్మనపల్లి కొమురయ్య వద్ద ఉన్న బంగారం చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. గునుకుల కొండాపూర్ గ్రా మానికి చెందిన కారును సెల్ఫ్‌డ్రైవ్ అద్దెకు తీసుకున్నారు. కొమురయ్య ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించారు. బుధవారం రాత్రి తిమ్మాపూర్ శివా రులో కొమురయ్యను అడ్డగించి మెడలోని తులం బంగారు గొలుసుతో పాటు బైక్ పత్రాలు లాక్కుని పారిపోయారు. బాధితుడు ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని కారులోని జీపీఎస్‌ను ట్రాక్ చేసి, కేశవపట్నంలో నిందితులను పట్టుకుని ఎల్‌ఎండీ స్టేషన్‌కు తరలించారు.
తిమ్మాపూర్ శివారులో దారి దోపిడీ
తులం బంగారంతో కారులో దొంగల పరార్
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి ఎల్‌ఎండీ పోలీసులు
కారు జీపీఎస్ ట్రాక్‌చేసి కేశవపట్నంలో పట్టివేత


