జ్యోతినగర్(రామగుండం): శ్రీరామచంద్ర రైల్వే ట్రాక్ సొసైటీ లిమిటెడ్‌లో అధ్యక్ష, కార్యదర్శులు సుమారు రూ.1.80 కోట్లకు సంబంధించిన బిల్లులు సొసైటీలో జమచేయకుండా మాయం చేశారని సభ్యులు నిరసనకు దిగారు. రామగుండం ఎన్టీపీసీ టీటీఎస్‌లోని సొసైటీ కార్యాలయం ఎదుట మంగళవారం రాత్రి నిరసన తెలిపారు. బాధితులు మాట్లాడుతూ, సొసైటీకి సంబంధించిన పనులు చేపట్టగా బిల్లులు మంజూరయ్యాయని, ఆ సొమ్ము సొసైటీ ఖాతాలో జమ చేయకుండా వ్యక్తిగతంగా వాడుకున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే నష్టాలు వచ్చాయని బుకాయిస్తున్నారని ఆరోపించారు. మొత్తం 111 మంది సభ్యులు గల సొసైటీలో ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు మాయం కావడంతో సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇద్దరు వ్యక్తులపై ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు సభ్యులు తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సభ్యులు వివరించారు.
సభ్యుల నిరసన


