● తిప్పిరి తిరుపతి తమ్ముని కుమార్తె ఆరోపణ
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని హాజీపురా ఏరియాలో ఉన్న తమ భూమిని కొంత మంది కబ్జా చేస్తున్నారని ఇటీవల లొంగిపోయిన తిప్పిరి తిరుపతి తమ్ముడు గంగాధర్ కుమార్తె సుమ ఆరోపించారు. 1980లో గంగాధర్ చట్టబద్దంగా కొనుగోలు చేసిన భూమిని చాంద్‌పాషా అనే వ్యక్తి తమదే అని అడ్డుపడుతున్నారని, తాము మున్సిపల్ అనుమతులతో నిర్మాణం చేపడితే చాంద్‌పాషా వ్యక్తులు వచ్చి అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ నెల 7న ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా సుమారు 30 మంది వచ్చారని, తాము తవ్విన గుంతలను టిప్పర్లతో పూడ్చేశారని పేర్కొన్నారు. తమ భూ మిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కులం పేరుతో తమను దూషిస్తున్నారని, ఇంటి నిర్మాణానికి అడ్డువస్తున్న 12 మందిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశామని తెలిపారు. తమకు న్యాయం చేసి తమ భూమిలోకి అక్రమంగా వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


