మేడిపల్లి: మద్యానికి బానిసై.. తండ్రిని డబ్బుల కోసం వేధించగా ఇవ్వకపోవడంతో మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాలూక రాకేశ్ (29) తాగుడుకు బానిసయ్యాడు. తండ్రిని నిత్యం డబ్బులకోసం వేధిస్తున్నాడు. ఫిబ్రవరి 20న ఎప్పటిలాగే మ ద్యం సేవించి ఇంటికి వచ్చి తండ్రి రవిని మరింత డబ్బు అడిగాడు. ఆయన ఇవ్వకపోయేసరికి ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. బంధువులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


