అవయవ దానం.. ఆరుగురికి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

అవయవ దానం.. ఆరుగురికి పునర్జన్మ

Mar 11 2026 7:35 AM | Updated on Mar 11 2026 7:35 AM

హుజూరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో గాయప డి, చనిపోయిన యువకుడి అవయవాలు దానం చేయగా... ఆరుగురికి పునర్జన్మ లభించింది. హుజూరాబా ద్‌ పట్టణంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన బొగ్గుల రాహుల్‌(28) ఈనెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి ఈనెల 9న మృతి చెందాడు. అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లోనూ కుటుంబసభ్యులు రాహుల్‌ అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. మృతుడి తండ్రి బొగ్గుల రాజేశం, సోదరుడు రాకేష్‌కు పలువురు అభినందించారు.

శతాధిక వృద్ధురాలు మృతి

మృతదేహం కరీంనగర్‌ మెడికల్‌ కళాశాలకు అందజేత

జగిత్యాల: జగిత్యాలలోని అరవింద్‌నగర్‌కు చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపల్లి అమృతభాయి మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ మెడికల్‌ కళాశాలకు అందించారు. వందేళ్లు బతకడంతోపాటు, ఆమె పార్థివ దేహాన్ని మెడికల్‌ కళాశాలకు అందించడం అభినందనీయమన్నారు. ఆయన వెంట సొసైటీ సభ్యులు మంచాల కృష్ణ పాల్గొన్నారు.

బైక్‌ ఢీకొని దివ్యాంగుడు మృతి

ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన దివ్యాంగుడు కోలాపురి శ్రీనివాస్‌(38) బైక్‌ ఢీకొని మృతిచెందాడు. ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. పుట్టుకతోనే దివ్యాంగుడైన శ్రీనివాస్‌ ఈనెల 8న రాత్రి గుంపులలో జరిగే ఓ వేడుకకు వెళ్లాడు. ఆ తర్వాత రోడ్డుపై వస్తుండగా గుంపులకు చెందిన భిక్షపతి అనే వ్యక్తి బైక్‌పై అతివేగంగా, అజాగ్రత్తతో వచ్చి ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను జమ్మికుంటకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. చికిత్స పొందుతూనే మంగళవారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు కొలపురి రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన చిందం ప్రసాద్‌ (21) సోమవారం సాయంత్రం స్నేహితులను కలిసేందుకు బైక్‌పై వెళ్లాడు. అర్ధరాత్రి పద్మనగర్‌ సబ్‌స్టేషన్‌ వద్ద అదుపుతప్పి బివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తండ్రి చిందం శ్రీను ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని టూటౌన్‌ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement