సీఎం కప్‌ విజేతలు వీరే.. | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌ విజేతలు వీరే..

Feb 25 2026 9:43 AM | Updated on Feb 25 2026 9:43 AM

సీఎం

సీఎం కప్‌ విజేతలు వీరే..

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో సీఎంకప్‌ 2025 సెకండ్‌ ఎడిషన్‌ రాష్ట్రస్థాయి పోటీలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు హాజరై పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. నల్గొండలో ఈనెల 20నుంచి 23వ వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీఎంకప్‌ ఖోఖోపోటీల్లో జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయస్థానం కై వసం చేసుకుంది. జట్టు సభ్యులను ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, ఓరుగంటి రమణారావు, వి.సూర్యప్రకాశ్‌ అభినందించారు.

బాక్సింగ్‌లో..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో కరీంనగర్‌కు చెందిన సుకుమార్‌ 63కేజీల్లో రజతం, 54 కేజీల విభాగంలో ఎండీ రియాన్‌ కాంస్యం సాధించారు. క్రీడాకారులను డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్‌, ఉమ్మడి జిల్లా బాక్సింగ్‌ సంఘం ప్రతినిధులు సత్యనారాయణ, కొత్తకొండ సంపత్‌ కుమార్‌, బొల్లనేని అనిల్‌ కుమార్‌ అభినందించారు.

వుషులో మానేరు విద్యార్థులు

హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన వుషు చాంపియన్‌షిప్‌ పోటీల్లో కరీంనగర్‌ మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పతకాలు సాధించారని పీఈటీ సిలివేరి మహేందర్‌ తెలిపారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో 48 కేజీల లోపు కేటగిరీలో రిషిక్‌ రజతం, 41 కేజీల్లో అశ్వంత్‌ కాంస్య పతకం సాధించారన్నారు. జూనియర్‌ విభాగంలో 56 కేజీలలోపు కేటగిరీలో ప్రణయ్‌ రజత పతకం, 48 కేజీల్లో మధుకర్‌ కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్‌ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్‌ సరితారెడ్డి అభినందించారు.

యోగా పోటీల్లో

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఐదు పతకాలు సాధించారు. బాలుర అండర్‌– 19 విభాగంలో పి.దీపక్‌ బంగారు పతకం, జె.అశ్విత్‌, హర్షిత్‌ బాలాజీ రజత, అండర్‌–25 పురుషుల విభాగంలో రాహుల్‌ బంగారు పతకం, చరణ్‌ తేజ రజత, అభిషేక్‌గౌడ్‌ కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు అభినందించారు.

సీఎం కప్‌ విజేతలు వీరే..1
1/3

సీఎం కప్‌ విజేతలు వీరే..

సీఎం కప్‌ విజేతలు వీరే..2
2/3

సీఎం కప్‌ విజేతలు వీరే..

సీఎం కప్‌ విజేతలు వీరే..3
3/3

సీఎం కప్‌ విజేతలు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement