పురిటిలోనే పాప మృతి
● సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఘటన
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం ఏరియా ఆస్పత్రిలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ పాప పురిటిలోనే మృతి చెందింది. ఆర్జీ–1 ఏరియా జీడీకే–1గనిలో పనిచేసే శ్రీనివాస్ భార్యకు 7నెలలు నిండాయి. అనారోగ్య సమ స్యలు తలెత్తడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పురిట్లోనే పాప మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్లతో వాదనకు దిగారు. ఆస్పత్రిలో అడ్మిషన్ చేసుకున్నా పాపను బతికించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, అక్టోబర్‌లోనే జాయిన్ కావాలని చెప్పామని, పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రికి తీసుకొచ్చారని ఏసీఎంవో అంబిక వివరించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పాప మృతి చెందినట్లు పేర్కొన్నారు. షుగర్ హైలెవల్ ఉండటంతోనే ఈపరిస్థితి ఏర్పడిందన్నారు.
గనుల్లో ప్రమాదాలు.. కార్మికులకు గాయాలు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని రెండు బొగ్గు గనుల్లో జరిగిన ప్ర మాదాల్లో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యా యి. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 డోజర్ సెక్షన్‌లో గ్రేడర్ బ్లేడ్ రిపేర్ చేస్తుండగా బ్లేడ్ స్లిప్ అయి కాలుపై పడింది. దీంతో అభిలాష్ అనే అప్రెంటీస్‌కు గాయాలయ్యాయి. వెంటనే గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనిలో కేబుల్ లాగుతుండగా అదుపుతప్పి కిందపడటంతో రవిరాజ్ అనే జనరల్ అసిస్టెంట్‌కు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
సైదాపూర్: ఎగ్లాస్ పూర్‌లో మోరె నరేశ్ ఇల్లు శుక్రవారం సా యంత్రం ప్రమాదవశాత్తు దగ్ధమైందని గ్రామస్తులు తెలిపా రు. మోరె నరేశ్–జమున వ్యవసా య పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్ద ఉండగా.. ఇద్ద రు పిల్లలు సమీప ఇళ్ల వద్ద ఆడుకుంటున్నారు. సాయంత్రం మంచినీళ్ల కోసం ఇంటికి వచ్చిన నరేశ్ కుమారుడుకి ఇల్లు కాలుతూ మంటలు కనిపించడంతో.. ఇరుగుపొరుగు వారికి చెప్పా డు. స్థానికులు మంటలార్పే ప్రయత్నం చేశారు. తాటికమ్మలు, ప్లాస్టిక్ కవర్ పైకప్పు కావడంతో పూర్తిగా దగ్ధమైంది. బట్టలు, మంచాలు, బియ్యం, బీరువా, ఇతర సామాన్లు కాలిపోయాయి. సుమారు రూ.5లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఏఎన్‌ఎం శారదపై శుక్రవారం పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు సివిల్ దు స్తుల్లో వచ్చి విచారణ పేరుతో ఇబ్బందులకు గు రిచేశారని తెలిపింది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన మరో కార్యకర్త విషయంలో తనకు సంబంధాలు ఉన్నాయంటూ.. ఆ కేసు విషయంలో తాను మహిళా అని కూడా చూడకుండా పోలీసులు చేయి పట్టుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ విషయంపై ఎల్లారెడ్డిపేట పోలీసులను వివరణ కోరగా.. ఓ కేసు విషయంలో ధర్మపురి పోలీసులు వచ్చి విచారించి వెళ్లారన్నారు. శారదను బెదిరింపులకు గురిచేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు.


