యువతి అదృశ్యం
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలో నివాసం ఉంటున్న జెట్టి రాజేశ్వరి కూతురు జెట్టి అనూష(23) గురువారం రాత్రి నుంచి కినిపించకుండా పోయిందని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి కుటుంబంతో కలిసి ఐదేళ్లక్రితం పూసాలకు వచ్చి నివాసం ఉంటోందన్నారు. అయితే, అనూషకు కొన్నేళ్లుగా మతిస్థిమితం సరిగ్గా ఉండడం లేదన్నారు. ఈక్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో నుంచి ఎటోవెళ్లిపోయింది. శుక్రవారం వరకూ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లి తమకు ఫిర్యాదు చేసిందని ఎస్సై పేర్కొన్నారు. సమాచారం తెలిసినవారు 87126 56511నంబరుకు ఫోన్‌చేసి చెప్పాలని ఆయన కోరారు.


