నిబంధనలు పాటించాలి
కరీంనగర్‌రూరల్: పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని కరీంనగర్‌రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ హెచ్చరించారు. కరీంనగర్ మండలంలో సమస్యాత్మక గ్రామాలైన మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, చామనపల్లి, నగునూరు గ్రామాల్లో ఆదివారం కవాతు నిర్వహించారు. మొగ్ధుంపూర్, నగునూరులో ఏసీపీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులకు విరుద్ధంగా ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే అభ్యర్థులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 11న పోలింగ్‌ను ప్రశాంతవాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు. సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.
సెపక్‌తక్రాలో పతకాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: మహబూబాబాద్ జిల్లా కురవిలో ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 సెపక్ తక్రా పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు చాంపియన్ షిప్ సాధించగా.. బాలికల జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. అండర్–14 బాలికల జట్టు తృతీయస్థానం సాధించింది. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే అండర్–17 జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి గన్ను విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. క్రీడాకారులను డీవైఎస్‌వో వి.శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, సెపక్ తక్రా కోచ్‌లు కుమార్, శ్రీనివాస్, సుమన్, శ్రీకాంత్ అభినందించారు.
విజిలెన్స్ విచారణ చేపట్టాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని జంక్షన్ల అభివృద్ధి పేరిట చోటుచేసుకొన్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ బండారి వేణు కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. నగరంలోని ఇందిరాచౌక్, వన్‌టౌన్,పద్మనగర్ జంక్షన్‌లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై ్కన ఇంజినీరింగ్ అధికారులు అంచనాలను భారీగా పెంచి, రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. రూ.60 లక్షలతో పూర్తి చేస్తామన్న ఇందిరాచౌక్ జంక్షన్‌ను రూ.కోటి 20 లక్షలకు అంచనాలు పెంచి, రూ.కోటి బిల్లు కూడా ఇచ్చారన్నారు. జంక్షన్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించి, ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరారు.
కొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ పనులు కొనసాగుతున్నందున సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తేజ స్కూల్, ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, రెడ్డి ఫంక్షన్‌హాల్, సరస్వతీనగర్, వడ్ల కాలనీ, చంద్రాపూర్‌కాలనీ, రెవెన్యూ కాలనీ, హనుమాన్‌నగర్, అమ్మగుడి, తీగులగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్–1, కరీంనగర్‌రూరల్ ఏడీఈలు పంజాల శ్రీనివాస్ గౌడ్, గాదం రఘు తెలిపారు.
నిబంధనలు పాటించాలి


