ఏకగ్రీవ గ్రామాలకు త్వరలో నిధులు
కరీంనగర్/చొప్పదండి: ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామాలకు త్వరలోనే కేంద్రం నుంచి రూ.10లక్షల నిధులు మంజూరు చేయిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని మండలం విజయ్‌నగర్ కాలనీ పంచాయతీ ఏకగ్రీవం కాగా.. సర్పంచ్‌గా ఎన్నికై న అమూల్య రాజశేఖర్ ఆదివారం బండి సంజయ్‌ని కలిశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ను సంజయ్ సత్కరించారు. త్వరలోనే రూ.10లక్షల ప్రోత్సాహక నిధులను అందజేస్తానని హామీ ఇచ్చారు. గన్నేరువరం మండలం పీచుపల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న సామ రాజిరెడ్డి సంజయ్‌ని కలిశారు. శౌర్య దినోత్సవం సందర్భంగా నాటి కరీంనగర్ కర సేవకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్‌ను మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ ఘనంగా సన్మానించారు. అయోధ్య రామ మందిరం అనే పాటకు ముగ్ధుడైన కేంద్రం మంత్రి బండి సంజయ్ కుమార్ చొప్పదండికి చెందిన ప్రముఖ గాయకుడు చీకట్ల లచ్చయ్యను అభినందించారు.


