ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సదరు ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా రాండమైజేషన్లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ర్యాండమైజేషన్‌లో పోలింగ్ అధికారులు 1,255, ఇతర పోలింగ్ అధికారులు 1,773 మందిని కేటాయించినట్లు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లను జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ కలెక్టర్‌కు వివరించారు.


