కొత్త వైన్స్‌లకు షాక్
కరీంనగర్‌రూరల్: కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులకు సోమవారం తొలిరోజే అధికారులు షాకిచ్చారు. మద్యం స్టాక్ సకాలంలో కేటాయించకపోవడంతో దుకాణాలను తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది. అసలే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ మద్యం అందుబాటులో లేక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలుండగా కరీంనగర్‌అర్బన్‌లో 21, కరీంనగర్‌రూరల్ పరిధిలో 26 ఉన్నాయి. ప్రారంభంతోనే పంచాయతీ ఎన్నికలతో గిరాకీ ఉంటుందని వ్యాపారులు భావించారు. కరీంనగర్‌రూరల్ మండల పరిధిలో నగునూరు, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ గ్రామాల్లో గతంలో నిర్వహించిన దుకాణాల్లోనే కొత్తవ్యాపారులు మద్యం అమ్మకాలు ప్రారంభించారు. అయితే, గతంలో కరీంనగర్‌రూరల్ పరిధిలో ఉన్న బొమ్మకల్, దుర్శేడ్‌లోని మద్యం దుకాణాలను ప్రస్తుతం అర్బన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాలను పొందిన వ్యాపారులు ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశమేర్పడింది. గతంలో బొమ్మకల్ పరిధిలోని మద్యం దుకాణం పొందిన వ్యాపారులు కొత్తగా గోపాల్‌పూర్‌లోని రాజీవ్ రహదారి పక్కన కొత్త షెడ్ నిర్మించారు. అయితే షెడ్ నిర్మాణం పూర్తికాకపోవడంతోపాటు లైసెన్స్‌దారుడికి పాస్‌వర్డ్ జారీలో జాప్యంతో రాత్రి మద్యం స్టాక్ కేటాయించారు. మరికొన్ని దుకాణాలకు సైతం సకాలంలో స్టాక్ ఇవ్వకపోవడంతో చివరకు రాత్రి దుకాణాలు తెరిచినట్లు సమాచారం. తీగలగుట్టపల్లికి చెందిన మద్యం దుకాణం చల్మెడ ఆనందరావుమెడికల్ కళాశాల సమీపంలోని పెట్రోల్‌బంకు పక్కన ఏర్పాటు చేశారు. రెండు మద్యం దుకాణాలు రాజీవ్ రహదారిలో ఏర్పాటు చేయడంతో మద్యం కొనుగోళ్లతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడే అవకాశముందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే కొత్త మద్యం దుకాణాలకు అవసరమయ్యే స్టాక్‌కు డిపోలో బిల్లు చేసి కేటాయించడంలో కొంత జాప్యమేర్పడిందని కరీంనగర్‌రూరల్ ఎకై ్సజ్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. దుకాణాలన్నింటికీ మద్యం స్టాక్‌ను అలాట్‌మెంట్ చేశామని వివరించారు.


