అంతటా ‘వందేమాతరం’
కరీంనగర్ అర్బన్/కరీంనగర్‌క్రైం/కరీంనగర్ కార్పొరేషన్: స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల క్రమంలో జిల్లాకేంద్రంలోని వాడవాడన, కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ గౌస్‌ఆలం వందేమాతర గేయాన్ని ఆలపించారు. అడిషనల్ డీసీపీ భీంరావు, ఆర్‌ఐ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. బల్దియాలో కమిషనర్ ప్రఫుల్‌దేశాయి ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వందేమాతరం గీతాలాపన చేశారు. అంబేడ్కర్ స్టేడియంలో విద్యార్థులు పాల్గొన్నారు.


