లక్కు.. లిక్కర్‌ కిక్కు! | - | Sakshi
Sakshi News home page

లక్కు.. లిక్కర్‌ కిక్కు!

Oct 28 2025 7:36 AM | Updated on Oct 28 2025 7:36 AM

లక్కు

లక్కు.. లిక్కర్‌ కిక్కు!

సమాచారం

మహిళలకు 23.. పురుషులకు 71

లక్కీడ్రా ద్వారా మద్యం షాపుల కేటాయింపు

ప్రక్రియ చేపట్టిన కలెక్టర్‌ పమేలా సత్పతి

ఎకై ్సజ్‌ శాఖకు పెద్దఎత్తున ఆదాయం

డిసెంబర్‌ ఒకటి నుంచి

కొత్త వైన్స్‌ షాపులు ప్రారంభం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కరీంనగర్‌క్రైం :

ద్యం కొత్త దుకాణాలకు లక్కీ డ్రా ముగిసింది. కలెక్టర్‌ పమేలా సత్పతి చేతుల మీదుగా సోమవారం జిల్లాలోని 94 షాపులకు కలెక్టరేట్‌ ఆడిటోరియం వేదికగా డ్రా తీసి షాపులను కేటాయించారు. జిల్లావ్యాప్తంగా 2,730 దరఖాస్తులు రాగా రూ.81.90 కోట్లు ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వారితో పాటు వారి పార్ట్‌నర్‌లు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు భద్రత కల్పించారు. ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైన్స్‌ల కేటాయింపు పక్రియ ప్రశాంతంగా ముగిసింది. కొత్త దుకాణాలు ఈ డిసెంబర్‌ ఒకటి నుంచి 2027 నవంబర్‌ 30 వరకు కొనసాగనున్నాయి.

రిజర్వేషన్‌ల వారీగా..

జిల్లావ్యాప్తంగా 94 దుకాణాలు ఉండగా 23 షాపులను మహిళలు గెలుచుకున్నారు. ఇందులో గౌడ్‌ రిజర్వేషన్‌లో 17 ఉండగా 3 దుకాణాలు, ఎస్సీ రిజర్వేషన్‌లో 9 దుకాణాలుండగా 1 మహిళలు గెలుచుకున్నారు. మొత్తంగా పురుషులు 71 దుకాణాలు గెలుచుకున్నారు. ఇందులో వారి పేరు మీద కలిసివస్తుందని చాలా మంది భర్తలు తమ భార్యలపేరు మీదుగా వేయగా వారికి దుకాణాలు రావడంతో హర్షం వ్యక్తం చేశారు. చాలా మంది ముహూర్తాలు చూసుకొని మరి టెండర్‌ లక్కీ డ్రాకు వచ్చారు. నగరంలోని ఒక షాపును పల్లె వెంకటేశ్‌ అనే వ్యక్తి ఒకే టెండర్‌ వేసి డ్రా ద్వారా గెలుచుకోవడంతో సంబ్రమాశ్చర్యాలలో ఆనందభాష్పాలు రాల్చి హర్షం వ్యక్తం చేశాడు. షాపులు దక్కించున్నవారు సంతోషంగా ఉండగా రానివారు నిరాశతో వెనుదిరగడం కనిపించింది. మద్యం పాత వ్యాపారులు పెద్ద ఎత్తున టెండర్లు వేసినా కొందరికి అనుకున్న స్థాయిలో వైన్స్‌లు దక్కలేదు. కోరుకున్న చోట రాని వ్యాపారులు ఆయా ప్రదేశాల్లో కొత్తగా వచ్చినవారిని గుర్తించి బేరసారాలు నడిపినట్లు సమాచారం. కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చి డ్రా లో ఎంపికై నవారి వేటలో మద్యం వ్యాపారులు ఉన్నారు. వారికి కొంతమొత్తం ఆఫర్‌ ఇచ్చి ఎలాగైనా ఆయా షాపులు కై వసం చేసుకోవాలని చూస్తున్నారు.

పెద్ద ఎత్తున ఆదాయం

వైన్స్‌ టెండర్లు, షాపుల కేటాయింపు ప్రక్రియ ద్వారా ఎకై ్సజ్‌శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. గతంలో మద్యం టెండర్ల ద్వారా రూ.80.80 కోట్లు రాగా ప్రస్తుతం కొత్త టెండర్ల ద్వారా ఇప్పటికే రూ.81.90 కోట్లు ఆదాయం దరఖాస్తుల రూపంలో వచ్చింది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా షాపులవారీగా ఏటా 43 షాపులు రూ.65 లక్షలు, 40 షాపులు రూ.55 లక్షలు, 11 షాపులు రూ.50 లక్షలు ఇలా మూడు స్లాబులుగా చెల్లిస్తారు. వీరు స్లాబ్‌ ప్రకారం ఏటా చెల్లించాల్సి ఉండగా రెండేళ్లకు కలుపుకొని రూ.110.9 కోట్ల ఆదాయం ఈసారి వైన్స్‌ల ద్వారా ఎకై ్సజ్‌శాఖకు సమకూరనుంది. ఇందులో ఆరోవంతు ఆదాయం అనగా సుమారు రూ.18.5 కోట్లు మంగళవారం సాయంత్రం వరకు వైన్స్‌లు వచ్చినవారు చెల్లించాల్సి ఉండగా చాలా మంది సోమవారం రాత్రి వరకు చెల్లించారు. ఈ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు కౌంటర్‌ సైతం ఆడిటోరియంలో ఏర్పాటు చేయగా, ఆన్‌లైన్‌ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. టెండర్‌ల డ్రా పక్రియలో ఎకై ్సజ్‌ సీఐలు రాము, అశోక్‌కుమార్‌, సాయిబాబ, శ్రీనివాసులు, మాధవీలత, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నరేందర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ రాంచందర్‌రావు పాల్గొన్నారు.

వైన్స్‌ దరఖాస్తులు: 2,730

వచ్చిన ఆదాయం: రూ.81.90 కోట్లు

మొత్తం షాపులు: 94

మహిళలకు: 23, పురుషులు: 71

వైన్స్‌షాపుల కాలపరిమితి: డిసెంబర్‌ 1 నుంచి 2027 నవంబర్‌ 30 వరకు

లక్కు.. లిక్కర్‌ కిక్కు!1
1/1

లక్కు.. లిక్కర్‌ కిక్కు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement