నల్లబియ్యం సాగు.. డిమాండ్ అధికం
రామగిరి(మంథని): అందరూ పాలిష్ బియ్యానికి అలవాటుపడ్డారు. బియ్యం అంటే తెల్లగా, నాజూగ్గా ఉంటాయనే తెలుసు. కానీ, బ్లాక్, రెడ్‌రైస్ కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నాడు కల్వచర్ల గ్రామానికి చెందిన రైతు యాదగిరి శ్రీనివాస్.. అప్పట్లో ఈబియ్యంతో భోజనం చేశామని, అందుకే గట్టిగా ఉన్నామంటున్నారు. తన నానమ్మ బొదమ్మ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని పాతతరం నాటువరి పంటతో లాభాలు తెలుసుకొని నల్లని వరి సాగుచేసేందుకు నడుం బిగించాడు. తనకున్న మూడు ఎకరాల్లో పాత పద్ధతిలో పంటలు పండిస్తున్నాడు. పశువుల పేడ, మూత్రాన్ని సేకరించి, అందులో శనగపిండి, బెల్లంకలిపి జీవామృతాన్ని తయారు చేసి పొలంలో చల్లుతున్నాడు. కొన్నిసందర్భాల్లో స్ప్రే విధానంతో సేంద్రియ ద్రావణాలను పంటకు పట్టిస్తున్నాడు. ఒక ఎకరానికి 3 కిలోల విత్తనాల నారు ప్లాస్టిక్ ట్రేలలో పెంచి.. 110– 200 రోజులకు(సుమారు 4 నెలల నుంచి 6 నెలల పంట కాలం) శ్రీ పద్ధతిలో పండిస్తున్నాడు. సుమారు 400 రకాల వరి వంగడాలను శ్రీనివాస్ పండిస్తున్నాడని చెబుతున్నాడు.
నల్లబియ్యం సాగు.. డిమాండ్ అధికం


