‘కబ్జా’లపై హౌసింగ్ అధికారుల కొరడా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 7వ డివిజన్ హౌసింగ్‌బోర్డుకాలనీలో కబ్జాలపై హౌసింగ్ విభాగం అధికారు ల చర్యలు కొనసాగుతున్నా యి. ‘నయా భూ దందా’ పేరిట గత నెలలో వచ్చిన ‘సాక్షి’ కథనంతో వరంగల్‌లోని హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ఏఈ పృథ్విరాజ్ ఆధ్వర్యంలో ఇప్పటికే కాలనీలోని రెండు చోట్ల కబ్జా చేసిన ప్రహరీలను ఇటీవల కూ ల్చివేసి, స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం కాలనీలోని తీగలవంతెనకు వెళ్లే మెయిన్‌రోడ్డులో ఆక్రమణలను తొలగించారు. దాదాపు పదిగుంటల స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ప్రహరీ, షెడ్డును నేలమట్టం చే శారు. అత్యంత విలువైన స్థలం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, నగరపాలకసంస్థ అధికారు ల సహకారం తీసుకున్నారు. నగరపాలకసంస్థ ఏసీపీ వేణు, టీపీఎస్ తేజస్విని పాల్గొన్నారు.
చొప్పదండి: చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనితీరును ఏటా మెరుగుపరుస్తుండడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.41 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి తెలిపారు. పట్టణంలోని సహకార సంఘ భవనంలో శనివారం పాలకవర్గ సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. సంఘం ఆదాయం రూ.కోట్లకు చేరడానికి తన నిర్ణయాలకు మద్దతు తెలుపుతు సహరిస్తున్న రైతులకు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ద్వారా ప్రస్తుత సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రంలో అమ్మకం ద్వారా ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. వైస్ చైర్మన్ ముద్దం మహేశ్ గౌడ్, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్‌క్రైం: ట్రాఫిక్ ఆర్‌ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కమాన్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. రాంగ్ రూట్లో వస్తున్న టీఎస్22 7090 ద్విచక్రవాహనాన్ని పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా.. వాహనంపై రూ.29,560 విలువ గల 120 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వాహన యజమాని నగరంలోని గణేశ్ నగర్‌కు చెందిన కటుకోజ్వల కిరణ్ కుమార్ అని తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశారు.
‘కబ్జా’లపై హౌసింగ్ అధికారుల కొరడా


