పకడ్బందీగా ఎస్‌ఐఆర్ జాబితా
కరీంనగర్ అర్బన్: ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితా పకడ్బందీగా తయారు చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎస్‌ఐఆర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2002 ఎస్‌ఐఆర్‌తో 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్‌స్థాయి అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారని వివరించారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో భాగంగా కేటగిరీ ‘ఏ’ను బీఎల్‌వో యాప్ ద్వారా ధృవీకరిస్తామని, కేటగిరీ సి,డి లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. ఈఆర్‌వో కార్యాలయంలో ఇద్దరు బూత్ స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామని అన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.


