సైకిల్ ర్యాలీ.. రక్తదానం
కరీంనగర్‌క్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వా రోత్సవాల సందర్భంగా శనివారం నగరంలో 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీపీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభించారు. బస్‌స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, పొన్నం కాంప్లెక్స్, కెమిస్ట్ భవన్ మీదుగా కోర్ట్ చౌర స్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, బస్టాండ్ సర్కిల్ నుంచి పరేడ్ గ్రౌండ్‌కు చేరింది. సీపీ ర్యాలీలో పాల్గొన్న స భ్యులకు మెడల్స్ అందించారు. డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, మాధవి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, మహేశ్ పాసుల, అజయ్ ఖండాల, కిరణ్ పాల్గొన్నారు.
పీటీసీలో రక్తదానం
పీటీసీలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ గౌస్‌ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ ఎస్పీ ఎం.పిచ్చయ్య మాట్లాడుతూ.. క్యాంపులో సేకరించిన 80 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్‌కు అందిస్తామన్నారు. వైస్ ప్రిన్సిపాల్ బి.మోహన్, జి.విజయపాల్‌రెడ్డి, మల్లికార్జున్, గంగాధర్ పాల్గొన్నారు.


