పోష‘కాలబట్టి’
మంథనిరూరల్: పాతకాలపు వరి విత్తనాలతో సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేస్తున్నాడు రైతు. ఏటా ఓ రకం వరిని పండిస్తూ పోషక విలువలున్న ధాన్యం పరిచయం చేస్తున్నాడు. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఎల్క సదానందం తనకున్న అర ఎకరంలో ఈసారి కాలాబట్టి వరి సాగు చేశాడు. అత్యధిక పోషక విలువలు ఉన్న ఈ ధాన్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నాడు. మూడేళ్ల క్రితం కృష్ణవ్రీహి, రెండేళ్ల క్రితం రక్తశాలి, గతేడాది నవారా, ఈసారి కాలాబట్టి సాగు చేశాడు. నవారా ధాన్యం కేవలం ఒక్కపూట మాత్రమే తినాలని, రక్తశాలి రక్తం పెంచుతుందని, కాలాపట్టి తింటే క్యాన్సర్, బీపీ, షుగర్ లాంటి వ్యాధులు దరి చేరవని రైతు చెబుతున్నాడు.
కరోనా తర్వాత ఆలోచన చేశా..
కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం అనేక కష్టాలు పడ్డారు. ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం బాగుండాలనే ఆలోచన చేశా. నాడు తిరుపతి నుంచి 20గుంటల భూమికి సరిపడేలా 12కిలోల విత్తనాలు తీసుకువచ్చి సాగు చేశా. అప్పటి నుంచి ఏటా ఒక రకం తీసుకువస్తున్నా. వచ్చిన పంటను అవసరమైన వారికి ఇస్తున్నా.
– ఎల్క సదానందం, రైతు, గుంజపడుగు
పోష‘కాలబట్టి’
పోష‘కాలబట్టి’


