
ఉత్సాహంగా హాఫ్ మారథాన్
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. 3,5,10,21 కిలోమీటర్ల పరుగులో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, క్రీడాకారుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష 10,21 కిలోమీటర్ల పరుగును, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు 3,5 కిలోమీటర్ల మారథాన్ రన్ ప్రారంభించారు. మారథాన్‌లో పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేయగా విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు వుడుతల పద్మావతి, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, నిర్వాహకులు మహేశ్, దాసరి శ్రీపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.