స్వయం ఉపాధితో సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధితో సక్సెస్‌

Oct 13 2025 8:40 AM | Updated on Oct 13 2025 8:40 AM

స్వయం

స్వయం ఉపాధితో సక్సెస్‌

‘బెరడు’తో ఉపాధి రూ.లక్షతో యూనిట్‌ మరిన్ని యూనిట్లు..

ఆర్థికాభివృద్ధి కోసం శ్రమిస్తున్న మహిళలు

జూట్‌ బ్యాగుల తయారీతో

ముందడుగు

సారంగాపూర్‌(జగిత్యాల): కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని స్వశక్తి సంఘాలు శ్రమించి, వారు ఏర్పాటు చేసుకున్న యూనిట్ల ద్వారా సక్సెస్‌ అవుతున్నారు. సెర్ప్‌ ద్వారా కొంత బ్యాంక్‌ రుణం అందిస్తే, మరికొంత వారు జమ చేసుకుని యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. సారంగాపూర్‌ సెర్ప్‌, జాగృతి మండల సమాక్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు.

548 సంఘాలు.. 6,120 మంది సభ్యులు

సారంగాపూర్‌ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. మండలవ్యాప్తంగా 548 మహిళ సంఘాలను ఏర్పాటు చేయగా, 6,120 సభ్యులు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 432 మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.26.83 కోట్ల రుణాలు అందజేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు 104 సంఘాలకు రూ.13.98 కోట్ల రుణాలు అందజేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఏ వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుందో వారి చాయిస్‌కు అనుగుణంగా యూనిట్ల ఏర్పాటుకు మహిళా సంఘాల ద్వారా రుణసాయం అందిస్తున్నారు.

ప్రత్యేక శిక్షణ

జూట్‌ బ్యాగుల తయారీ, బ్యూటీషియన్‌, కుట్టు శిక్షణ, మగ్గం వర్క్‌, ఫాబ్రిక్‌ పెయింటింగ్‌, ఇమిటేషన్‌ జ్యూలరీ తయారీ వంటి వాటిపై నెల రోజుల నుంచి 3 నెలల పాటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆర్‌ఎస్‌ఈటీఐ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలు యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి శ్రమించి విజయం సాధిస్తున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్‌ రుణం చెల్లిస్తూ, తమ కుటుంబానికి కొంత వాడుకుంటున్నారు.

జూట్‌ బ్యాగ్‌లకు భలే గిరాకీ

సారంగాపూర్‌ గ్రామానికి చెందిన రాస రమ జూట్‌ బ్యాగ్‌ల తయారీకి శిక్షణ పొందింది. లంచ్‌ బ్యాగులు, సమోస బ్యాగ్‌, లగేజీ బ్యాగ్‌, వెటిటేబుల్‌ బ్యాగ్‌, మార్కెట్‌ బ్యాగ్‌, వాటర్‌ బాటిళ్ల బ్యాగ్‌, గిఫ్ట్‌ బ్యాగు, తాంబూలం బ్యాగు, పౌచ్‌లను ఆకట్టుకునే డిజైన్లు, రంగులతో తయారు చేస్తున్నారు.

కరీంనగర్‌రూరల్‌: స్వయం ఉపాధి కోసం ఈ యువకులు ఎంచుకున్న దందా చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా హు స్నాబాద్‌కు చెందిన కొందరు యువకులు బూట్‌ పాలీష్‌ కలర్‌ తయారీ కోసం దురిసేనా చెట్ల బెరడును సేకరిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌ మండలం జూబ్లీనగర్‌లో మకాం వేసిన యువకులు దు రిసేనా చెట్ల కొమ్మలను సేకరించారు. కొమ్మలను చిన్న ముక్కలుగా కట్‌ చేస్తున్న సమయంలో కొ మ్మల నడుమ ఉన్న బెరడు నుంచి ఎర్రనిరంగు జిగటలాగా బయటకు వస్తోంది. బూట్‌ పాలీష్‌ కలర్‌తయారీ చేసే కంపెనీలు ఈ రంగును ఉపయోగిస్తాయని శ్రీకాంత్‌ అనే యువకుడు తెలి పాడు. ముక్కలను పూర్తిగా ఎండబెట్టిన అనంత రం కిలో రూ.150 చొప్పున హైదరాబాద్‌లో బ్రోకర్లకు విక్రయిస్తామని పేర్కొన్నాడు. ప్రధానంగా దురిసేనా చెట్ల కొమ్మలను కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల నుంచి సేకరిస్తామని, వర్షాకాలంలో మాత్రమే ఈ వ్యాపారం చేస్తామని వివరించాడు.

కొమ్మలను ముక్కలుగా కట్‌ చేస్తున్న యువకుడు

సెర్ప్‌ ద్వారా రూ.1 లక్ష పెట్టుబడితో జూట్‌ బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశాను. జూట్‌ను హైదరాబాద్‌ నుంచి తెప్పించి తయారు చేస్తున్నా. ఈ ఏడాది పాఠశాలల ప్రారంభ సమయంలో సారంగాపూర్‌ మండల ప్రభుత్వ పాఠశాలల 300 మంది విద్యార్థులకు మరో మహిళా సంఘ సభ్యురాలితో కలిసి స్కూల్‌యూనిఫాంలు కుట్టినం. దీని ద్వారా మంచి ఉపాధి దొరుకుతుంది.

– రాస రమ, సారంగాపూర్‌

సారంగాపూర్‌ మండలంలోని 18 గ్రామాల్లో మహిళలు ఇప్పటికీ వ్యవసాయం అనుబంధంగా ఉన్న పలు యూనిట్లను ఏర్పాటు చేసుకుని సక్సెస్‌ అవుతున్నారు. రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారుల సహకారంతో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తాం.

– చంద్రకళ, ఏపీఎం, సెర్ప్‌(ఐకేపీ)

స్వయం ఉపాధితో సక్సెస్‌1
1/3

స్వయం ఉపాధితో సక్సెస్‌

స్వయం ఉపాధితో సక్సెస్‌2
2/3

స్వయం ఉపాధితో సక్సెస్‌

స్వయం ఉపాధితో సక్సెస్‌3
3/3

స్వయం ఉపాధితో సక్సెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement